కాంగ్రెస్ లేకుండానే విపక్ష కూటమి: ప్రశాంత్ కిశోర్

178
prashanth
- Advertisement -

దేశంలో కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి సాధ్యమేనన్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్.. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారుతుందన్నారు. 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా గెలిచింది లేదని ఎద్దేవా చేశారు.

ప‌దే ప‌దే ట్వీట్లు చేయ‌డం, ఓ క్యాండిల్ ర్యాలీ నిర్వ‌హించ‌డం ద్వారా బీజేపీని రాహుల్ గాంధీ ఓడించ‌లేర‌న్నారు. గ‌త 10 సంవ‌త్స‌రాల్లో 90 శాతం కాంగ్రెస్ వైఫ‌ల్యాన్ని పొందుతూనే వ‌స్తోందన్నారు.

కాంగ్రెస్ లేకుండా ప్ర‌తిప‌క్ష కూట‌మి సాధ్య‌మ‌య్యే విష‌యం కాద‌ని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లేకుండా ఏ ఒక్క‌రూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేర‌న్నారు. వీరిద్ద‌రి త‌ర్వాత కాంగ్రెస్ వ్య‌వ‌హారంపై వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

- Advertisement -