- Advertisement -
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార టీఎంసీ,బీజేపీ మధ్య మాటల యుద్దం తారాస్ధాయికి చేరింది. ముఖ్యంగా పార్టీ ఫీరాయింపులో బెంగాల్ పొలిటికల్ వాతావరణం రోజుకో టర్న్ తీసుకుంటుండగా టీఎంసీకి రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చేది తృణమూల్ కాంగ్రెస్ పార్టీనేనని కుండబద్దలు కొట్టిన ప్రశాంత్ బీజేపీకి అదిరే సవాల్ విసిరారు. బెంగాల్‌లో బీజేపీకి డబుల్ డిజిట్ కూడా రాదని ఒకవేళ డబుల్ డిజిట్ దాటితే ప్రస్తుతం తాను చేస్తున్న వృత్తి నుంచి వైదొలిగి దీనికి పూర్తిగా భిన్నమైన వేరే వృత్తిలోకి వెళ్లిపోతానని శపథం చేశారు.
తృణమూల్ తనంతట తనను బలహీనపర్చుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు.
- Advertisement -