టీఎస్ ఐసెట్ షెడ్యూల్ రిలీజ్

55
icet

తెలంగాణ ఐసెట్‌ షెడ్యూల్‌ (2021-22) రిలీజైంది. ఏప్రిల్‌ 3న ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నామని…7 నుంచి జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఆలస్య రుసుముతో అభ్యర్థులు జులై 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా ఆగస్టులో ఐసెట్‌ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.

ఇక మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే యూజీసీ నెట్-2021 కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించారు. గతంలో గడువు తేదీగా మార్చి 2 గా ఉండేది. అయితే, గడువు తేదీని ఈ నె 9 వరకు పొడగిస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థులు ugcnet.nta.nic.in లో ఎన్‌టీఏ యూజీసీ అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.