బీజేపీ రెండెంకల సీట్లు సాధిచడం కష్టం- ప్రశాంత్‌ కిశోర్‌

114
Prashant Kishor

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో ‘రెండంకెలను’ అధిగమించేందుకు బీజేపీ కష్టపడుతోందని, ఆ పార్టీకి వంద సీట్లు రావడం కష్టమేనని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ జోష్యం చెప్పారు. బెంగాల్‌ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రశాంత్‌ కిశోర్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అనుకూల మీడియాలో ఎంత ప్రచారం చేసుకున్నా.. వాస్తవంలో బీజేపీ రెండెంకల సీట్లు సాధించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

తాను అంచనా వేసిన దానికంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తే.. ప్రస్తుతం కొనసాగుతున్న రంగం నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. ప్రస్తుతం ప్రశాంత్‌ కిశోర్‌ వచ్చే బెంగాల్‌ శాసనసభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ సలహాదారుగా పని చేస్తున్నారు.