ప్రశాంత్ కిషోర్ గెలుపు

0
- Advertisement -

బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో లభించిన ఆధిక్యం కేవలం ఒక స్థానానికో లేదా ఒక ఎమ్మెల్యే ఎంపికకో పరిమితమైనది కాదని బిహార్‌లోని బీజేపీ అధిష్టానానికి ప్రజలిచ్చిన స్పష్టమైన సందేశమని జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. బిహార్ ప్రజలు క్రిమినల్ నేపథ్యం లేదా అనుమానాస్పద ప్రవర్తన, చరిత్ర కలిగిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బలమైన కోటగా ఉన్న బాంకీపూర్ నియోజకవర్గ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రశాంత్ కిశోర్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 20 వేలకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంలో గెలుపొందారు.

ఇది బాంకీపూర్ ప్రజల విజయం. మేం ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే, ఇది కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకునే సాధారణ ఎన్నిక కాదు. బిహార్‌ అభివృద్ధికి, మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి ప్రజలు పంపిన విజ్ఞప్తి. క్రిమినల్ రికార్డు లేదా వివాదాస్పద స్వభావం ఉన్నవారు బిహార్‌ను పాలించడం ఇక్కడి ప్రజలకు ఇష్టం లేదు. విద్యను మెరుగుపరిచి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, మన పిల్లలు ఉద్యోగాల కోసం వలస పోకుండా చూసే సమర్థుడైన సీఎంను బిహార్ కోరుకుంటోంది అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

Also Read:విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు ఎత్తివేస్తాం!

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మరియు బీజేపీ కేంద్ర నాయకత్వం బిహార్‌ అభివృద్ధిపై, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యేలు కావడం తమ లక్ష్యం కాదని, బిహార్ సమగ్ర అభివృద్ధే జన సురాజ్ పార్టీ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.

- Advertisement -