రాష్ట్రంలో రాగ‌ల 4 రోజుల్లో విస్తారంగా వానలు..

25
rains

తెలంగాణలో రాగ‌ల 4 రోజుల్లో విస్తారంగా వ‌ర్షాలు కరిసే అవకాశమున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ‌ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆవ‌ర్త‌నం ప్ర‌భావంతో వాయ‌వ్య బంగాళాఖాతం, ఒడిశా, బెంగాల్‌లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. రాగ‌ల 24 గంట‌ల్లో మ‌రింత బ‌ల‌ప‌డి ఒడిశా మీదుగా వెళ్లే అవ‌కాశం ఉంది. అల్ప‌పీడ‌న ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా ద్రోణి విస్త‌రించింది. అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో రాగ‌ల 4 రోజుల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

ఇవాళ‌, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. రేపు, ఎల్లుండి ఒక‌ట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్న వాతావ‌ర‌ణ శాఖ‌.. ఉత్త‌ర‌, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.