నేటి నుండే ప్రాణహిత పుష్కరాలు…

110
pushkaralu
- Advertisement -

నేటి నుండి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. కొమురంభీం జిల్లా కౌటాల, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరొంచలో ఒకే ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 3.54 గంటలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి.

చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

ప్రాణహిత పుష్కరాలకు కాళేశ్వరం దేవస్థానం ముస్తాబైంది. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. పుణ్యస్నానాలు చేసిన భక్తులు కాళేశ్వర-ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. మొదటి రోజే 10 క్వింటాళ్ల లడ్డూ ప్రసాదాలను అందించనున్నారు.

- Advertisement -