- Advertisement -
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోయారని జరుగుతున్న పుకార్లకు చెక్ పెట్టారు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ. సోషల్ మీడియాలో ప్రణబ్ చనిపోయారని ప్రచారం జరుగుతోందని దానిని నమ్మవద్దన్నారు.
తన తండ్రి బ్రతికే ఉన్నారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు అభిజిత్. ప్రణబ్ త్వరలో కోలుకుంటారని…ఆయన కోసం మీ ప్రార్థనలకు కొనసాగించాల్సిందిగా కోరుతూ ట్వీట్ చేశారు.
ప్రణబ్ ఇంకా కోమాలోనే ఉన్నట్లు తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి ఆస్పత్రి వర్గాలు. రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోందని… వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుందని డాక్టర్లు వెల్లడించారు.
- Advertisement -