బీజేపీపై ప్రకాశ్‌ రాజ్‌ఘాటు వ్యాఖ్యలు

22
- Advertisement -

బీజేపీపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. 420లు 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని, ఇవి అహంకారంతో కూడిన మాటలని మండిపడ్డారు. కర్ణాటకలోని చిక్‌మంగళూరులో మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ రాజ్..ప్రధాని మోడీ, బీజేపీ పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు.

ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400.. అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదు. ప్రజలు ఓటు వేస్తేనే సదరు అభ్యర్థి గెలుస్తారు. ..ఇది ముమ్మాటికీ అహంకారమే అన్నారు ప్రకాశ్ రాజ్.

కేంద్రంలో ఈసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని మోడీ నేతృత్వంలోని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.అబ్కీ బార్,400 పార్ అనే నినాదాన్ని ప్రతీ సభలో వినిపిస్తున్నారు మోడీ. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read:సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్

- Advertisement -