PSPK: పవన్ సినిమాల అప్‌డేట్!

16
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల అప్‌డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్. పాలిటిక్స్‌లో బిజీగా ఉండటంతో సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన పవన్..తన కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు సినిమాపై దృష్టి సారించారు. హరి హర వీర మల్లు సెట్లోకి అడుగుపెట్టిన పవన్.. ఇవాళ్టితో తన పార్ట్ షూటింగ్‌ను కంప్లీట్ చేయనున్నారు.

అలాగే మరో పాన్ ఇండియా చిత్రం OG షూటింగ్‌లో కూడా పాల్గొనననున్నారు పవన్ . ఇందుకోసం మే మూడో వారం నుండి డేట్స్ కేటాయించినట్టు సమాచారం. మే నెలలోపు మొత్తం షూటింగ్ పనులను పూర్తి చేయనున్నట్లు భావిస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు అమరావతిలో పూర్తవుతాయని సమాచారం.

అలాగే హరిహర వీరమల్లు ట్రైలర్‌ని త్వరలో విడుదల చేయనున్నట్లు ఏఎమ్. రత్నం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్‌ కూడా ఖరారు కానున్నాయి.

Also Read:బెట్టింగ్ యాప్స్‌పై ఫైట్ చేస్తే కేసు పెడతారా?

- Advertisement -