ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యుద్ధ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఫౌజీ మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన రాగా అందులోని ఓ సన్నివేశం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను చూపించిన తీరుపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ప్రభాస్ పోషిస్తున్న పాత్రను జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు పరిచయం చేస్తున్నట్లు చూపించారు. ఈ సన్నివేశంపై నేతాజీ మునిమనవడు చంద్రకుమార్ బోస్ అభ్యంతరం తెలిపారు. కల్పిత పాత్రకు నేతాజీ ఓ సహాయకుడిలా కనిపించే విధంగా సన్నివేశాన్ని చిత్రీకరించడం సరికాదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
హిట్లర్‌తో నేతాజీ భేటీని సాధారణ పరిచయంలా చూపించడం కూడా అభ్యంతరకరమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు పొందాలనే రాజకీయ లక్ష్యంతో నేతాజీ హిట్లర్‌ను కలిశారని, ఆ చారిత్రక సందర్భాన్ని సరైన నేపథ్యంతో, గౌరవప్రదంగా చూపించాలని వారు కోరుతున్నారు.
Also Read:TTD:తిరుమలలో భక్తుల రద్దీ
ఈ నేపథ్యంలో నేతాజీ కుటుంబ సభ్యులు చిత్ర నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని, నేతాజీని గౌరవప్రదంగా చూపించేలా సన్నివేశాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేసినట్లు తెశారు.

