మా ఎన్నికలు.. నామినేష‌న్‌ వేసిన ప్ర‌కాశ్ రాజ్..

106
Prakash Raj Nomination

అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కొద్ది సేప‌టి క్రితం ప్ర‌కాశ్ రాజ్ త‌న ప్యానెల్ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇక నామినేష‌న్స్ ప‌రిశీల‌న 30 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అక్టోబర్‌1-2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. కాగా, ఈ ఎన్నికలలో ముఖ్యంగా ప్ర‌కాశ్‌ రాజ్,మంచు విష్ణు మ‌ధ్యే పోటీ ఆస‌క్తిక‌రంగా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ప్రకాశ్ రాజ్ ప్యానల్ లోని సభ్యులు వీరే:

అధ్యక్షుడు – ప్రకాశ్‌రాజ్‌
ఉపాధ్యక్షులు – బెనర్జీ, హేమ
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ – శ్రీకాంత్
జనరల్ సెక్రటరీ – జీవితా రాజశేఖర్
ట్రెజరర్ – నాగినీడు

ఎగ్జిక్యూటివ్ మెంబర్స్: అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూమ్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు, సురేశ్ కొండేటి, తనీశ్, టార్జాన్.