‘ప్రజాకవి కాళోజీ’..సెన్సార్

19
- Advertisement -

తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించి, అనేక కారణాల చేత నిష్క్రమించారు. అయితే అమ్మ నీకు వందనం, క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’, ‘వంటి ప్రయోజనాత్మక ‘సినిమాలు తీసిన దర్శకులు ప్రభాకర్ జైనీ ఒకడుగు ముందుకు వేసి కాళోజి బయోపిక్ కొరకు రెండు సంవత్సరాల రీసెర్చి చేసి అనంతరం జైనీ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మాణంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు బయోపిక్ వెండితెరపై రూపుదిద్దుకోవడం జరిగింది. కాళోజీ గా మూలవిరాట్, కాళోజీ భార్యగా పద్మ, కొడుకుగా రాజ్ కుమార్, కోడలుగా స్వప్న తదితరులు నటిస్తున్నారు. విజయవంతంగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కు వెళ్ళబోతున్న సందర్బంగా చిత్రలోని పాటలను మీడియాకు ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాతలు తుమ్మలపల్లి రామస త్యనారాయణ, సాయి వెంకట్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు .అనంతరం

చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ..మేము ఎంతో సంకల్పంతో రాత్రి పగలు కష్టపడి చేసిన ఈ సినిమాను ఎలా రిలీజ్ చెయ్యాలో తెలియక తర్జన,బర్జన పడుతున్న మాకు ఈ రోజు మా పాటలు ప్రదర్శనకు తిలకించడానికి వచ్చిన శతాదిక చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మా సినిమాలోని గొప్ప ఔణ్యత్యాన్ని గుర్తించి మా సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పడం మాకు కొండత దైర్యాన్ని ఇచ్చింది. వారికీ మా ధన్యవాదములు.. ఇక సినిమా విషయానికి వస్తే కాళోజీ జీవితం ఒక అనంత ప్రయాణం. కాళోజీ జీవిత చరిత్ర గురించి వారి సన్నిహిత మిత్రుల ద్వారా వినడంతో , పది సినిమాలకు సరిపడినంత కంటెంట్ లభించింది. దానిని ఒక సినిమా పరిధిలోకి కుదించడం, దాదాపు అసాధ్యం. అందుకే, కాళోజీ ఔన్నత్యాన్ని, కాళోజీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని సన్నివేశాలను మాత్రమే ఉదాహరణగా తీసుకుని…ఆయా సంఘటనలను సృష్టించుకుని, స్క్రీన్ ప్లే రాసుకున్నాను. ఇది రెగ్యులర్ సినిమా కాదు… ఒక జీవితం! ఇటువంటి గొప్ప సినిమా తీయడం సాహసమే అయినప్పటికీ నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.చిత్రీకరణ చేసేటప్పుడు మూలవిరాట్ ను చూసి నిజంగా కాళోజీ గారు వచ్చినట్లు ఉందని చాలా మంది చెప్పారు. పోలికలు కూడా అంతలా అచ్చుగుద్దినట్లు ఉంటాయి. కాళోజీ గారి కుటుంబ సభ్యులతో పాటు చూసిన వారంతా కాళోజీయే బ్రతికి వచ్చి తమ కళ్ళ ముందు నడయాడుతున్నట్టుగా ఫీలయ్యారు.అలాగే మేం ఈ సినిమాను కాళోజీ గారు జీవించిన, ఆయన తిరిగిన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమా ఉంటుంది. సెన్సార్ కు వెళ్ళబోతున్న మా సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు.

చిత్ర నిర్మాత విజయలక్ష్మీ జైనీ మాట్లాడుతూ…తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు బయోపిక్ వెండితెరపై ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాము.ఈ సినిమాకు ఏ సంస్థ గానీ, ప్రభుత్వం గానీ సహాయం చేయకపోయినా ఎంతో కస్టపడి ఇష్టంగా ఈ సినిమా నిర్మించడం జరిగగింది., విశాఖలో కృష్ణబాయమ్మ గారి ఇంట్లో కాళోజీ ఉన్న దృశ్యాలు అద్భుతంగా వచ్చాయి. అమృతలత గారి ఇంటిలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. కాళోజీ నివసించిన ఇంట్లోనే సన్నివేశాలు తీశాం. కాళోజీ గారు వాడిన కళ్ళజోడు, చేతి కర్రను ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో ఉపయోగించాం.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Also Read:Guava:జామకాయతో ఎన్ని ఉపయోగాలో

సంగీత దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ..ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యే గోరేటి వెంకన్న, రెండు వందేమాతరం శ్రీనివాస్, ఒకటి మాళవిక, భూదేవి పాడారు. ఈ పాటలలో కాళోజీ కవితల సారాంశాన్ని పొందు పరిచాము. పాటలు ఈ సినిమాకు ఒక ఔన్నత్యాన్ని ఆపాదిస్తాయని అన్నారు.

- Advertisement -