డిప్యూటీ సీఎం నివాసంగా ప్రజాభవన్

31
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా మార్చి ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రజా భవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

వాస్తవానికి దీనిని సీఎం నివాసం కోసం నిర్మించారు. 2016 లో ప్రగతి భవన్ ప్రారంభం కాగా ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజి అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. 9 ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో ముఖ్యమంత్రి నివాసం, ముఖ్యమంత్రి కార్యాలయం, జనహిత (సమావేశ మందిరం) వేర్వరుగా నిర్మించారు.

- Advertisement -