- Advertisement -
రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. రైతులు ఎర్రకోటపై జెండా ఎగురవేయగా ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎర్రకోటను ఇవాళ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ సందర్శించారు.
వారసత్వ సంపదకు చెందిన సుమారు 400 ఏళ్ల క్రితం నాటి రెడ్‌ఫోర్ట్.. రైతుల దాడిలో కొంత ధ్వంసమైంది. కోటపై జెండాలు పాతే క్రమంలో బురుజు ఎక్కిన రైతులు అక్కడ ఉన్న ఇటుకలను తొలగించారు. కొన్ని చోట్ల గోడ ధ్వంసమైందని వెల్లడించారు.
రైతులు తీసిన ట్రాక్టర్ ర్యాలీ వల్ల సుమారు 300 మంది పోలీసులు గాయపడగా 22 కేసులు నమోదు చేశారు.
- Advertisement -