- Advertisement -
ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 విజయవంతంగా జాబిల్లిపై ల్యాండ్ కాగా ప్రజ్ఞాన్ రోవర్ అధ్యయనం కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలో చందమామపై భారీ గుంతను గుర్తించగా ఇస్రో కమాండ్‌తో ప్రజ్ఞాన్ రోవర్ దిశను మార్చుకుంది. ఆ తర్వాత మరో దిశగా సురక్షితంగా వెళుతోందని ఇస్రో అధికారులు వెల్లడించారు.
ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై స్థిరంగా ఉంటుంది. రోవర్ ఆ ప్రాంతంలో తిరిగి అక్కడి సమాచారాన్ని ల్యాండర్ కు పంపుతుంది. ఆ ల్యాండర్ నుంచి ఇస్రోకు సమాచారం అందుతుంది. రోవర్ కు ఆరు చక్రాలు ఉంటాయి.
ల్యాండర్, రోవర్ జీవిత కాలం ఒక లూనార్ డే. విక్రమ్ ల్యాండర్ (3 పేలోడ్స్), రోవర్ (2 పేలోడ్స్) జాబిల్లి గుట్టును విప్పుతాయి. ఒక్కో క్షణానికి ఒక సెంటీ మీటరు వేగం చొప్పున రోవర్ ముందుకు వెళ్తుంది.
Also Read:బాబోయ్.. కుర్ర హీరోతో రొమాన్స్
- Advertisement -