రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి…లిరికల్ సాంగ్

33
- Advertisement -

తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘ రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు. యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్రం నుండి యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఐ లవ్ యు” లిరికల్ సాంగ్ విడుదలైంది.

Also Read:బాబోయ్.. కుర్ర హీరోతో రొమాన్స్

ఈ పాట మధురమైన సంగీతం, చక్కని సాహిత్యంతో హృదయాలను ఆకర్షిస్తుంది. రెహమాన్ రచించిన ఈ చిత్ర గీతాన్ని యాజిన్ నిజర్, నూతన్ మోహన్ పాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం. “ఐ లవ్ యు” అనే పాట చిత్ర బృందం యొక్క అంకితభావం మరియు కృషికి నిదర్శనం. చిత్ర నాయికా నాయకులపై చిత్రీకరించ బడ్డ ఈ గీతం యువతరం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్ర కథాంశం, ఈ తరం సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.ఈ పాట విడుదలకు ముందే విడుదల అయిన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టీజర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం కొద్ది రోజులలో థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధ మవుతోంది.

Also Read:ఎన్టీఆర్ చాలా నేర్చుకోవాలి!

- Advertisement -