క్రేజీ ఆఫర్‌ కొట్టేసిన ప్రగ్యా..

141

టాలీవుడ్‌లో హాట్‌ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఆఫర్లతో దూసుకుపోతోంది. రీసెంట్‌ గా గుంటూరోడు సినిమాలో మంచు మనోజ్ తో రొమాన్స్‌ చేసింది ఈ   హీరోయిన్‌. ఇక ఈ సినిమాతో ఆడియెన్స్ ను తన అందాలతో పడగొట్టేసింది ప్రగ్యా. అయితే మనోజ్‌ తో రొమాన్స్‌ చేసిన ఈ భామ మనోజ్‌ అన్నయ్యతో కూడా రొమాన్స్‌ కి సై అంటోంది.
 Pragya Jaiswal To Romance Manchu Vishnu
తాజాగా మంచు విష్ణు తన నెక్ట్స్‌ మూవీలో బిజీ అయిపోతున్నాడన్న విషయం తెలిసిందే. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు లేటెస్ట్ మూవీ ‘ఆచారి అమెరికా యాత్ర’. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఛాన్స్‌ కొట్టేసింది ప్రగ్యా జైస్వాల్‌. ఈ అమ్మడు ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బెళ్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న సినిమా షూటింగ్‌కి హాజరవుతోంది.
 Pragya Jaiswal To Romance Manchu Vishnu
అయితే బోయపాటి సినిమాలో బిజీగా ఉన్న ప్రగ్యా…మే నెల నుంచి మంచు విష్ణుతో కలిసి ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఎం.ఎల్.కుమార్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ కూడా మార్చ్ చివరిలో విడుదలైన విషయం తెలిసిందే.

కాగా, ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి ఇప్పటికే తమ్ముడితో రొమాన్స్‌ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు అన్నయ్యతో కూడా రొమాన్స్‌కి రెడీ అయిపోయింది.