‘ఆ నిముషం’ టీజర్..

135
AA NIMISHAM logo, teaser launch

వేంకటేశ్వర మూవీ ఫ్యాక్టరీ (వి.ఎం.ఎఫ్)బ్యానర్‌పై కళా రాజేష్ దర్శకత్వంలో 34 మంది నూతన నటీనటులతో యువ నిర్మాత కోటపాటి ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఆ నిముషం’.ఈ చిత్రం లోగో, టీజర్‌ను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి బుధవారం ఫిలించాంబర్ ప్రివ్యూ థియేటర్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘ఆ నిముషం’ అంటూ ఒక్క నిముషంలో జరిగిన ఘటనను రెండు గంటల సినిమా మలిచే ప్రయత్నం చేసింది ఈ చిత్ర యూనిట్. ఇది నిజంగా కత్తిమీద సామే. లోగో, టీజర్‌లో చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న విషయం వీటిని చూస్తే అర్ధమౌతోంది.
AA NIMISHAM logo, teaser launch
దర్శకుడు రాజేష్ నాకు 10 సంవత్సరాలుగా పరిచయం. నా శిష్యుడే. నా కెరీర్ కూడా ‘16 టీన్స్’ అనే చిన్న సినిమాతోనే మొదలైంది. చిన్న సినిమాల రూప కల్పనలో యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఆ సినిమా సక్సెస్ అయితేనే వారికి లైఫ్. కాబట్టి కొత్తదనానికి చిన్న సినిమాలు భరోసాగా నిలుస్తాయి. మీడియా చిన్న చిత్రాలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నా. నిర్మాత ప్రసాద్‌రెడ్డి యువకుడే అయినప్పటికీ సీనియర్ నిర్మాతలా సినిమాను నిర్మించినట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.

తప్పకుండా అతనికి ఇది లాభాలు తెచ్చే ప్రాజెక్ట్ కావాలి అన్నారు. యువ నిర్మాత ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజేష్‌గారు ఈ కథ చెప్పగానే మంచి థ్రిల్ ఫీలయ్యా. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ‘ఆ నిముషం’ అనిపించింది. హర్రర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రమిది. ఈ జోనర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. మేం అడిగిన వెంటనే చిన్న చిత్రాన్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన నాగేశ్వరరెడ్డి గారికి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్నారు.

 AA NIMISHAM logo, teaser launch
దర్శకుడు కళా రాజేష్ మాట్లాడుతూ.. మా గురువు నాగేశ్వరరెడ్డి గారి చేతుల మీదుగా నా తొలి చిత్రం తొలి టీజర్ లాంఛ్ కావడం చాలా సంతోషంగా ఉంది. నా అనుభవంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేసుకున్నాను. మా నిర్మాత ప్రసాద్‌రెడ్డిగారు నా కథపై నమ్మకంతో ముందు రావడం ఆనందంగా ఉంది. రెండు జంటల మధ్య జరిగిన ఘర్షణ వాళ్ల కుటుంబ జీవితాల్ని ఎలా ప్రభావితం చేసింది అనేది ప్రధాన లైన్. ఇది పూర్తి థ్రిల్లింగ్, హర్రర్ డ్రామా. ప్రతి ఫ్రేవ్‌ు అద్భుతంగా రావడానికి మా డీఓపీ యోగి ప్రసాద్‌షా గారే కారణం. ఆయన కోట్ల రూపాయల భారీ బడ్జెట్ సినిమాలకు పనిచేస్తున్నప్పటికీ నేను అడిగిన వెంటనే అభిమానంతో ఈ చిన్న సినిమాకు పెద్ద స్థాయికి తీసుకు వెళ్లారు.

అలాగే కున్ని గుడిపాటి తన సంగీతంతో సినిమా రేంజ్‌ను పై లెవల్‌కు తీసుకు వెళుతున్నారు. మిగిలిన టెక్నీషియెన్స్ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. మీడియా మిత్రులు మా వెన్నంటి నిలుస్తారనే నమ్మకం ఉంది అన్నారు. చీఫ్ అసోసియేట్ రాయుడు మాట్లాడుతూ.. ఇది ఒక క్లాస్ హర్రర్ మూవీ. అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ చిత్రానికి డీఓపీ: యోగీ ప్రసాద్ షా, సంగీతం: కున్ని గుడిపాటి, ఎడిటింగ్, డి.ఐ, వి.ఎఫ్.ఎక్స్: డాలీ శేకర్, రాజేష్ అన్వేష్, చీఫ్ అసోసియేట్: సి.ఆర్. రాయుడు.