కోలీవుడ్ కి మరో ధనుష్ దొరికేసినట్టే

146
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకడు. బక్క పల్చని శరీరం ఉన్నప్పటికీ తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు ధనుష్. హీరోగా లవ్ స్టోరీస్ చేసుకుంటూ ఎదిగాడు. ప్రస్తుతం లవ్ స్టోరీస్ పక్కన పెట్టేసి సీరియస్ సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ‘సార్’ సినిమా చేస్తున్నాడు ధనుష్. అయితే ధనుష్ నుండి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ ఎక్స్ పెక్ట్ చేసే కోలీవుడ్ ఆడియన్స్ కి తాజాగా ప్రదీప్ రూపంలో మరో ధనుష్ దొరికేశాడు.

ప్రదీప్ రంగనాథన్ తాజాగా ‘లవ్ టుడే’ అనే సినిమాతో హీరోగా మారాడు. గతంలో జయం రవి తో దర్శకుడిగా ‘కోమాలి’ సినిమా చేసిన ప్రదీప్ లవ్ టుడే తో హీరోగా మారి కోలీవుడ్ లో యాబై కోట్లు కొల్లగొట్టాడు. ప్రదీప్ అచ్చం ధనుష్ లానే బక్క పల్చని శరీరంతోనే ఉంటాడు. అంతే కాదు ఇద్దరిలో కొన్ని ఫీచర్స్ సేం టు సేం ఉన్నాయి. అందుకే కోలీవుడ్ ఆడియన్స్ ప్రదీప్ లో యంగ్ ధనుష్ ని చూసుకుంటున్నారు.

dhanush

ప్రదీప్ రంగనాథన్ హీరో కం డైరెక్టర్ గా చేసిన లవ్ టుడే తాజాగా తెలుగులో డబ్బింగ్ సినిమాగా రిలీజైంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ కుర్ర హీరోను ధనుష్ తో పోలుస్తూ మాట్లాడుకుంటున్నారు. మరి ప్రదీప్ హీరోగా ధనుష్ చేయలేకపోతున్న ట్రెండీ లవ్ స్టోరీస్ తో తమిళ ప్రేక్షకులకు ఆ లోటు తీరుస్తాడా చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -