ఆసుపత్రిలో స్టార్ హీరో, అసలేం జరిగిందంటే ?

116
upendra
- Advertisement -

రియల్ స్టార్ ఉపేంద్ర ఓ సినిమా షూటింగ్‌లో నిన్న ఒక్కసారిగా ఉన్నట్టు ఉండి కుప్పకూలారు అనే వార్త సోషల్ మీడియానే షేక్ చేసింది. పడిన వెంటనే హుటాహుటిన ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఉపేంద్ర కు ఏమైంది ?, ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే ఉప్పీ ఇలా సడెన్ గా ఎందుకు కుప్ప కూలిపోయారు ?,లాంటి విషయాల పై ప్రేక్షకులు నిన్నటి నుంచి గూగుల్ సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఉపేంద్రకి ఏమైంది అంటే.. ఆయన నాలుగు రోజుల క్రితం జ్వరంతో బాధ పడ్డారు. అయితే, గత మూడు రోజుల నుంచి తన సినిమా షూట్ కోసం ఉపేంద్ర గ్యాప్ లేకుండా పని చేయడంతో ఆయనకు మళ్లీ జ్వరం వచ్చింది. ఆ నీరసం కారణంగానే ఆయన పడిపోయారు.

ప్రస్తుతం ఉపేంద్ర జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారని డాక్టర్స్ చెప్పుకొచ్చారు. అయితే, ఉపేంద్ర ఆరోగ్యం విషయంలో భయపడాల్సిన పనేం లేదు అని.. ఒకట్రెండు రోజుల్లో ఉపేంద్ర మునపటిలా పూర్తిగా ఎనర్జిటిక్ గా కనిపిస్తారని డాక్టర్స్ తెలిపారు. అయితే అప్పట్లో ఉపేంద్రకు ఒక చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో ఉపేంద్ర మోకాలికి గాయమైంది. ఆ గాయానికి ఆయన సర్జరీ కూడా చేయించుకున్నారు. ఐతే, ఈ మధ్య కాలంలో ఆ గాయం ఉపేంద్రను కొంత ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది.

వైద్యుల సలహా మేరకు ఆ మోకాలికి ఉపేంద్ర మళ్లీ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. ఏది ఏమైనా కన్నడంతో పాటు, తెలుగు, తమిళ సినిమాల్లోనూ ఉపేంద్ర నటించారు. తెలుగులో కూడా ఉపేంద్రకి అభిమానులు భారీగా ఉన్నారు. అందుకే.. ఉపేంద్ర హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు అనగానే సౌత్ ఇండస్ట్రీ అంతా టెన్షన్ పడింది. ఐతే తాజాగా ఉపేంద్ర తన ఆరోగ్యం స్పందించారు. సెట్ లో దుమ్ము కారణంగా తనకు సరిగ్గా ఊపిరి ఆడలేదని.. అందుకే హాస్పిటల్ కి వెళ్లాను అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -