నేపాల్ ప్రధానిగా ప్రచండ..

49
- Advertisement -

నేపాల్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. నేపాల్ నూతన ప్రధానిగా పుష్ప కమల్ దహల్(ప్రచండ) ఎన్నికయ్యారు. ఆరు పార్టీలు కలిసి ప్రచండను ప్రధానిగా ఎన్నికోవడంతో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీని కలిసిన ప్రచండ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నానని తన అభ్యర్థిత్వానికి సంబంధించిన దరఖాస్తును అందజేశారు. ఆమె ఆమోదం తెలపగానే ప్రచండ ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు.

రెండున్నరేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -