ఈ నెల 29న ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ వ‌స్తున్నాడు..

168
- Advertisement -

ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరో హీరోయిన్లుగా నటించగా శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘చార్లీ చాప్లిన్’ చిత్రాన్ని తెలుగులో శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్ .వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి తెలుగులోకి ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’పేరుతో అనువ‌దించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ఈ నెల 29న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఫిలించాంబ‌ర్‌లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ..మ‌హేష్ చౌద‌రి, వి.శ్రీనివాస‌రావు వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌గా ఎన్నో పెద్ద చిత్రాలు రిలీజ్ చేశారు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన చార్లి చాప్లిన్ చిత్రాన్నిమిస్ట‌ర్ ప్రేమికుడుగా తెలుగులో అనువ‌దిస్తూ నిర్మాత‌లుగా మారారు. ప్ర‌భుదేవా న‌టించిన ఎన్నో మంచి చిత్రాల్లో ఇదొక‌టి. మొద‌ట్లో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌డానికి చాలా మంది ప్ర‌య‌త్నించారు. ఎందుకంటే తెలుగు నేటివిటీకి స‌రిగ్గా స‌రిపోయే సినిమా ఇది. ల‌వ్, క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీ, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో పాటు ఇందులో మంచి పాట‌లు కూడా ఉన్నాయి. ప్ర‌భుదేవా న‌ట‌న‌, నిక్కి గ‌ల్రాని, అదాశ‌ర్మ అందం, అభిన‌యం, శ‌క్తి చిదంబ‌రం డైర‌క్ష‌న్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు. ఈ నెల 29 వ‌స్తోన్న ఈ చిత్రంతో నిర్మాత‌లకు మంచి లాభాలు వ‌చ్చి మ‌రెన్నో చిత్రాలు నిర్మించాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

డిస్ట్రిబ్యూట‌ర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి ఇద్ద‌రూ డిస్ట్రిబ్యూట‌ర్స్‌గా ఎన్నో మంచి చిత్రాలు రిలీజ్ చేశారు. ఈ సినిమాతో నిర్మాత‌లుగా మారారు. ఇటీవ‌ల విడుద‌లైన డబ్బింగ్ సినిమాలు మంచి క‌లెక్ష‌న్స్ రాబడుతున్నాయి. ఆ కోవ‌లో ఈ సినిమా కూడా విజ‌యం సాధించి నిర్మాత‌లు మంచి పేరు, లాభాలు తీసుకురావాల‌న్నారు.

నిర్మాత గుర్రం మ‌హేష్ చౌద‌రి మాట్లాడుతూ.. ఎక్కడా రాజీ ప‌డ‌కుండా తెలుగు స్ట్ర‌యిట్ సినిమాలా డ‌బ్బింగ్ చేయించాము. పాట‌లు కూడా బాగొచ్చాయి. త‌మిళంతో ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అయింది. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడుతుంన‌ద్న న‌మ్మ‌కం ఉంది. ఈ నెల 29న విడుద‌ల‌కు సిద్ధ‌మైన మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్న‌ అన్నారు.

వి.శ్రీనివాస‌రావు మాట్లాడుతూ.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిల‌వ‌నున్నాయి. ప్ర‌భుదేవ ప‌ర్ఫార్మెన్స్, డాన్స్‌తో పాటు అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని అందం, అభిన‌యం సినిమాకు హైలెట్. చాలా కాలం త‌ర్వాత ప్ర‌భుదేవ త‌ర‌హా హాస్యంతో పాటు ఆయ‌న డాన్స్‌ను మ‌రోసారి తెరపై క‌నువిందు చేయ‌బోతుంది. ఈ నెల 29న గ్రాండ్‌గా సినిమా రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం అన్నారు.

బాక్సాఫీస్ అధినేత ర‌మేష్ చందు మాట్లాడుతూ.. మ‌హేష్ చౌద‌రి గారు, శ్రీనివాస గారు చాలా కాలంగా ప‌రిచ‌యం. ఇద్ద‌రూ ఎంతో ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తులు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు చాలా రిచ్‌గా చేశారు. త‌మిళంలో ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

డిస్ట్రిబ్యూట‌ర్ గోపాల్ మాట్లాడుతూ.. మ‌హేష్ చౌద‌రి, శ్రీనివాస్ ఇద్ద‌రితో మంచి ప‌రిచ‌యం ఉంది. ఒక మంచి సినిమాను తెలుగులోకి అనువదించారు. డిస్ట్రిబ్యూట‌ర్స్‌గా స‌క్సెస్ అయ్యారు. నిర్మాత‌లుగా కూడా స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

- Advertisement -