టిఆర్ఎస్ ఇచ్చే పార్టీ.. బిజెపి గుంజుకునే పార్టీ..

107
koppula
- Advertisement -

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తామందరం కూడా టిఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేస్తమని జమ్మికుంట 1,2వ వార్డు లకు చెందిన ధర్మారం వాసులంతా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ల సమక్షంలో సుస్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వీరన్న,భిక్షపతి, సింగిల్ విండో ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలు,కార్యదక్షత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఒంటరి మహిళల సంక్షేమం గురించి ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్. లక్ష మంది ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నరు అని కొనియాడారు.

గతంలో ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేవి..వాటికోసం పేదలు అప్పులు చేసే వాళ్లు..ఈ విషయమై కెసిఆర్ మంచి ఆలోచన చేసి అమ్మ ఒడి పథకం తెచ్చారు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగింది అని గుర్తు చేశారు. గత పాలకులు చెరువులను పట్టించుకోలే, కెసిఆర్ 46వేల చెరువులను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బాగు చేసిండ్రు. అలాగే మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నం. గతంలో మంచినీళ్లకు గోస పడ్డం, అప్పుడు నాయకులు వస్తే తాగేందుకు నీళ్లు కావాలంటూ గొడవకు దిగే వాళ్లు.. కానీ కెసిఆర్‌ పాలనలో నీళ్ల కష్టాలు పోయాయి. 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నం. రైతులకు పంట సాయం, బీమా సౌకర్యాన్ని కెసిఆర్ ప్రవేశపెట్టారు. రైతు చనిపోతే 10 రోజుల్లోనే 5 లక్షలు ఇంటికి తెచ్చి ఇస్తున్నమని మంత్రి తెలపారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర వాసులు మా ప్రాంతాలను తెలంగాణలో కలిపితే బాగుండు అంటున్నరు. టిఆర్ఎస్ ఇచ్చే పార్టీ, బిజెపి గుంజుకునే పార్టీ అన్నారు. ఈటల టిఆర్ఎస్‌ను వదిలి పోయిండు.. మనం మొదటి నుంచి టిఆర్ఎస్ లోనే ఉన్నం. మనమందరం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నం తెలంగాణ తెచ్చుకున్నం..ఈటలను చూసి అయ్యో అయ్యో అని అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6సార్లు ఎమ్మెల్యే అయిండు,2 సార్లు మంత్రి అయ్యిండు. ఆయన టిఆర్ఎస్ నుంచి పోవడంతో కెసిఆర్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చి.. ఈ జమ్మికుంట మునిసిపాలిటీని గొప్పగా అభివృద్ధి చేస్తున్నం.. ఎన్నో సమస్యలు పరిష్కరించినం,అండగా ఉన్నం. ఏది మంచి,ఏది చెడు అనేది మీ అందరికి తెలుసు అన్నారు మంత్రి.

రాజేందర్ గెలిస్తే ఆయనకు మంచి జరుగుతది, టిఆర్ఎస్ గెలిస్తే మీ అందరు బాగు పడ్తరు. దళితబంధుతో ఎస్సీలు బాగుపడ్తరని బిజెపి వాళ్లు ఆపించిండ్రు. కానీ వారం రోజుల్లో మళ్లీ దళితబంధు మొదలవుతది. ఆ తర్వాత బహుజనులందరికి మంచి జరిగే పథకాలు వస్తయ్. బిజెపికి ఓటేస్తే పెంచిన ధరలను మనమంతా ఒప్పుకున్నట్టయితది. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మంచి మనిషి, ఉద్యమకారుడు, పేదింటి యువకుడు. ఆయనకు ఓటేసి గెలిపించండి మీకు అందుబాటులో ఉంటడు, సేవ చేస్తడు అని మంత్రి కోరారు.

- Advertisement -