ప్రభాస్ తో కుర్ర హీరో పోటీ !

159
- Advertisement -

బాహుబలి ఫ్రాంచైజీ తో ఎనలేని స్టార్డం అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కుర్ర హీరో పోటీ పడబోతున్నాడు. అయితే ప్రభాస్ తో కుర్ర హీరోకి రిలీజ్ విషయంలో పోటీ కాదు. కంటెంట్ విషయంలో. ప్రభాస్ రామాయణంలో కొన్ని ఘట్టాలతో ‘ఆది పురుష్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. మోషన్ పిక్చర్ టెక్నాలజీతో విజువల్ వండర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇటివల టీజర్రిలీజ్ చేశారు. మొదట టీజర్ కి నెగటివ్ వచ్చినా ఆ తర్వాత 3D టీజర్ కి మంచి రెస్పాన్స్ అందుకుంది.

అయితే ఈ సినిమాలో కొన్ని విషయాలకు సంబంధించి హిందూ సంఘాలు అబ్జెక్షన్స్ పెట్టడంతో మళ్ళీ రీ వర్క్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. అందుకే సంక్రాంతి పోటీ నుండి సినిమా తప్పుకుంది. కాగా ఈ సినిమాకు మరో విజువల్ వండర్ పోటీ అవ్వబోతుంది. తాజాగా తేజ సజ్జ నటించిన ‘హనుమాన్’ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ కంటెంట్ పై ఆసక్తి నెలకొల్పింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ టీజర్ చూసి ఆదిపురుష్ తో పోలుస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు.

నిజానికి ఆది పురుష కి హనుమాన్ కి ఎలాంటి సంబంధం లేదు. రెండూ వేర్వేరు కథలు. రామాయణంలో కొన్ని ఘట్టాలను ఆధరంగా చేసుకొని ఓం రూత్ సినిమా తీస్తే అంజనాద్రి అనే ఫిక్షన్ ప్లేస్ ఎంచుకొని మైథాలజీ లో నుండి హనుమాన్ కేరెక్టర్ తో సూపర్ నేచురల్ సినిమాగా హనుమాన్ ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. కాకపోతే ‘హనుమాన్’ టీజర్ చూస్తుంటే భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ ఏ మాత్రం తీసుపోని విధంగా ఉండనుందని అర్థమవుతుంది. పైగా హనుమాన్ మోషన్ పిక్చర్ టెక్నాలజీ కాదు. మరి ప్రభాస్ ఆదిపురుష్ కి హనుమాన్ టఫ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. చూడాలి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులని మెప్పిస్తుందో ?

ఇవి కూడా చదవండి…

టీజర్ టాక్ :  ‘హను మాన్’ క్వాలిటీ ఓకే..  కంటెంట్ మాటేమిటి ?   

సుంగంధాల రారాజు…లవంగం

నీరుగారిపోతున్న కిసాన్‌ నిధి…

 

- Advertisement -