వైర‌ల్ పిక్.. ‘ఆదిపురుష్‌’ సెట్‌లో బాహుబలి..

21
prabhas

యంగ్ రెబ‌ల్ స్టార్ హీరో ప్ర‌భాస్ బహుబలి తర్వత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో జూలై 30న త‌ను న‌టించిన రాధే శ్యామ్ చిత్రాన్ని విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌కు రాబోతున్నాడు. అలాగే అక్టోబ‌ర్‌లో స‌లార్ చిత్రంతో థియేట‌ర్స్‌లోకి రానున్నాడు. ఇక స‌లార్ చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు డైరెక్టర్‌ ప్ర‌శాంత్ నీల్.

కాగా,మ‌రోవైపు ప్ర‌భాస్ బాలీవుడ్‌లో న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆదిపురుష్‌. ఈ చిత్రం డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. 400 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా కనిపించ‌నుండ‌గా, రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీ ఖాన్ క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ముంబైలో వేసిన సెట్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే తాజాగా సెట్‌లో ఓ అభిమానితో ప్ర‌భాస్ ఫొటో దిగ‌గా, ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇందులో ప్ర‌భాస్ త‌ల‌కు స్టైలిష్ క్యాప్, క‌ళ్ల‌కు జోడు పెట్టుకొని స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటుంది.