కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె..

103
kcr

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజికవర్గం ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవిని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు. వాణీదేవి దివంగత మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె. వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 23 తుది గడువు. మార్చి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు.