బాహుబలి సినిమాతో టాలీవుడ్ జనాలకే కాదు బాలీవుడ్ జనాలకు సైతం మన డార్లింగ్ ప్రభాస్ తెగనచ్చేశాడు. అక్కడి స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రభాస్‌తో సినిమాలు తీసేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహో సినిమాలో నటిస్తున్న ప్రభాస్…లుక్ మార్చి ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో హీరోయిన్ కూడా అంతే స్థాయిలో ఉండాలని సాహో టీం భావించి.. ఫైనల్‌గా శ్రద్ధాకపూర్ వైపే మొగ్గు చూపింది.
అయితే బాహుబలి2 విడుదల ముందు నుంచే హీరోయిన్ వేటలో ఉన్న సాహో టీం ముందుగా శ్రద్ధాకపూర్‌ను సంప్రదించారట. ఆ సమయంలో ప్రభాస్ గురించి బాలీవుడ్లో ఎక్కువగా తెలియకపోవడం వల్ల శ్రద్ధాకపూర్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు, సాహోలో నటించేందుకు రూ.7 కోట్ల పారితోషికాన్ని అడిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమె అడిగిన రేటు నచ్చకపోవడంతో నిర్మాతలు వెనుకడుగు వేశారు. బాహుబలి2 విడుదల తరువాత ప్రభాస్ కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రద్ధా కపూర్ సాహోలో నటించడానికి ముందుకొచ్చినట్టు.. తన రెమ్యునరేషన్ కూడా భారీగా తగ్గించుకొన్నట్టు సమాచారం.
ఇక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రభాస్.. సుజీత్‌తో బాహుబలికి ముందే కమిట్మెంట్ ఇచ్చాడు. దీంతో సుజీత్‌తో సినిమా అయ్యాకే బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆలోచిస్తానని ప్రభాస్ అనుకున్నాడు. అయితే ప్రభాస్ లెక్కలు ఇంకో రకంగా ఉన్నాయి. ఒకసారి గమనిస్తే సాహో కోసం ప్రభాస్ ఇప్పటికే విలన్‌గా బాలీవుడ్ నటుడు నీల్ నిటిన్ ముఖేష్ ను తీసుకున్నాడు. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్‌గా బాలీవుడ్ సంగీత దర్శకులైన శంకర్-ఎహ్సాన్-లాయ్‌ను తీసుకున్నాడు. ఇప్పుడు హీరోయిన్గా శ్రధ్దాకపూర్కు ఓకే చేశాడు ప్రభాస్. ఇక సాహోతో బాలీవుడ్లో పూర్తి స్థాయి మార్కెట్ చేసుకున్న తరువాతే అక్కడి నిర్మాతలకు ప్రభాస్ అవకాశం ఇచ్చేలా ఉన్నాడు. సో ఈ లెక్కలు చూస్తుంటే ప్రభాస్ సాహో సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.