ఆ రోజునే ఉయ్యాలవాడ ఫస్ట్‌లుక్ !

166
Chiranjeevi’s Uyyalawada Narasimha Reddy logo to be out
Chiranjeevi’s Uyyalawada Narasimha Reddy logo to be out
- Advertisement -

‘ఖైదీ నెం 150’ విజయం తర్వాత చిరు 151 కోసం మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కథతో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఆయన సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ దాదాపు పూర్తి కాగా హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక వంటి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న లాంచ్ చేయాలనుకున్నారు. కానీ అందుకు ఇంకా రంగం సిద్ధం కాలేదు. ఈ తరుణంలోనే సినిమా లోగోను ఆగష్టు 22న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. 170 ఏళ్లకు పూర్వం చరిత్రను ఈ సినిమా కోసం ఆవిష్కరించనున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అసలు ఈ మూవీలో మెగాస్టార్ లుక్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. కచ్చితంగా అప్పటి కాలానికి తగినట్లుగా మెగాస్టార్ రూపం మారాల్సిందే. అందుకోసం మెగాస్టార్ కోసం తీవ్రంగానే కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందువలన ఈ సినిమాకి ‘మహావీర’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఏ టైటిల్ తో లోగోను రెడీ చేశారనేది చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరో రెండు నెలలు పట్టొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

- Advertisement -