హైద‌రాబాద్‌కు ఆదిపురుష్‌ టీం..

38
Adipurush

టాలీవుడ్‌ హీరో ప్ర‌భాస్ ప్రస్తుతం ఆదిపురుష్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్ న‌టులు సైఫ్ అలీఖాన్‌, కృతిస‌నన్ తోపాటు ఇత‌రులు కీలక రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ‌ దశలో ఉంది. అయితే ఈ చిత్రం ముంబైలో షూటింగ్‌ జ‌రుగాల్సి ఉండ‌గా..మ‌హారాష్ట్ర‌లో కోవిడ్ కేసులు మ‌రింత పెరుగుతుండ‌టంతో అక్క‌డి ప్ర‌భుత్వం సినిమా షూటింగ్స్ పై ఆంక్షలు విధించింది.

తాజా సమాచారం ప్ర‌కారం ఆదిపురుష్ టీం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ కు ప‌య‌నం కానుంద‌ట‌. హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా వేసిన ఇండోర్ సెట్‌లో ప్ర‌భాస్ అండ్ టీంపై కోవిడ్ రూల్స్ పాటిస్తూ కీల‌క షెడ్యూల్ షూట్ చేయ‌నున్నార‌ట‌. న‌టీన‌టులందరితోపాటు సాంకేతిక సిబ్బంది మే రెండో వారంలో న‌గ‌రానికి చేరుకోనున్న‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత షూట్ కు సంబంధించిన ప‌నులు షురూ చేయ‌నున్న‌ట్టు టాక్‌. బాలీవుడ్ న‌టులు సైఫ్ అలీఖాన్‌, కృతిస‌నన్ తోపాటు ఇత‌రులు కీ రోల్స్ పోషిస్తున్నారు.