గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి..

40
MLA Bhupal Reddy

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహా రెడ్డీ భూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం చాలా కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.