సాహో తరువాత వ్యవసాయం చేస్తా-ప్రభాస్

216
prabha
- Advertisement -

బాహుబలి సినిమాతో జాతీయ స్గాయి గుర్తింపు పొందారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తరువాత ఆయన సుజిత్ దర్శకత్వం సాహో చిత్రంలో కథానాయకుడి నటిస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెతో తెరకెక్కుతోంది. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం సాహో చిత్రీకరణ దుబాయ్ లో జరుతుగున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెబల్ స్టార్ మీడియాతో మాట్లాడారు.

Leaked-Prabhas-kick-ass-avatar-from

సాహో షూటింగ్ విషయాలను మీడియాతో పంచుకున్నారు. షూటింగ్ సమయంలో తెలుగు డైలాగులు ఒక్క టేక్ లోనే చేయగలుగుతున్నాని, కానీ హిందీలో చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పారు. తనకు హిందీ చదవడం, రాయడం వచ్చు అని, మాట్లాడటం అంతగా రాకపోవడం వల్లన షూటింగ్ సమయంలో నిరుత్సాపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఇక శ్రద్దా కపూర్ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

శ్రద్ద తెలుగులో షూటింగ్ చేసేటప్పుడు సింగిల్ టేక్ లోనే చేస్తుందని, హిందీ షూటింగ్ చేసేటప్పుడు రెండు మూడు టేకులు తీసుకుంటుందని చెప్పారు. బహుశా ఆమె తెలుగు డైలాగులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్లుందని అన్నారు. శ్రద్దా ఎంట్రీతోనే సినిమా స్టార్ట్ అవుతుందని, సినిమా నడిచే కొద్ది శ్రద్దా పాత్ర బలంగా ఉంటుందని తెలిపారు. ఇక సాహో సినిమా తర్వాత ఏ సినిమా చేస్తానో ఇంకా క్లారిటీ లేదన్నారు. సాహో తరువాత వ్యవసాయమైనా.. వ్యాపారమైనా లేదా ఈ రెండూ చేయొచ్చని చెప్పుకొచ్చారు.

- Advertisement -