- Advertisement -
అ! సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. బాలనటునిగా ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలు పొంది, ‘ఓ బేబీ’చిత్రంలో చేసిన కీలక పాత్రతో అందరినీ ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకూ, మోషన్ పోస్టర్‌కూ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హారర్, థ్రిల్లింగ్, గ్రాఫిక్స్ అంశాలతో నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల టీజర్ విడుదల చేశారు.
తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. న్యూయర్ గిఫ్ట్‌గా జనవరి 2న ప్రభాస్ చేతుల మీదుగా బిగ్ బైట్ అంటూ ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు మేకర్స్ .
- Advertisement -