గుజరాత్‌లో ఎయిమ్స్‌కు పునాదిరాయి..

30
modi

ఆరోగ్యం కంటే గొప్పది ఏదీ లేదని ఈ సంవత్సరం నిరూపించిందని, ఈ సంవత్సరం మొత్తం ప్రపంచానికి సవాలుగా మారిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోది. గుజరాత్‌ రాజ్‌కోట్‌లో నిర్మించతలపెట్టిన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పునదిరాయి వేసిన మోదీ అనంతరం ప్రసంగించారు.

కరోనాను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్న సహచరులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులను దేశం ఎన్నటికైనా గుర్తుంచుకుంటుందని ప్రధాని అన్నారు. కరోనా వైరస్‌ మహమ్మారిని నిలువరించేందుకు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే ఏడాదిలో వ్యాక్సినేషన్‌ జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఎయిమ్స్‌ను సెంట్రల్‌ పీఎస్‌యూ హెచ్‌ఎస్సీసీ లిమిటెడ్‌ నిర్మిస్తున్నది. రూ.1195 కోట్లు వెచ్చించి 750 పడకలతో నిర్మిస్తున్న ఎయిమ్స్ కోసం ప్రభుత్వం 201 ఎకరాల భూమిని కేటాయించింది. 2022 నాటికి పూర్తిచేయాలని సంకల్పంగా పెట్టుకున్నారు.