ఆదిపురుష్‌తో కృతిసనన్‌..!

156
prabhas
- Advertisement -

ఓం రావత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ఆదిపురుష్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ 2022 ఆగస్టు 11న విడుదల కానుండగా రోజుకో వార్త మూవీకి సంబంధించి టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుండగా ప్రభాస్‌కు జతగా ఎవరు నటిస్తారనే దానిపై రోజుకో వార్త వినిపిస్తోంది. తొలుత కీర్తి సురేష్‌ తర్వాత అనుష్కా శర్మ, శ్రద్ధా కపూర్, కియారా అద్వానీ నటించనున్నారనే వార్తలు వెలువడగా తాజాగా కృతి సనన్‌ పేరు తెరపైకి వచ్చింది.

ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుండగా ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ శ్రీరాముడిగా నటిస్తుండగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేష్‌(రావణుడి) పాత్రను పోషిస్తున్నారు. టీ-సిరీస్‌ పతాకంపై భూషన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

- Advertisement -