ఎఫ్‌3 రేటు పెంచిన వెంకీ-వరుణ్‌!

154
varun tej
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌- వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్‌ 2. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోగా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎఫ్3 స్ర్కిప్ట్‌ను అనిల్ రావిపూడి సిద్దం చేయగా ఈ మూవీని నిర్మించేందుకు దిల్ రాజు ముందుకొచ్చారు. అయితే డీసెంట్ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేయగా వరుణ్ తేజ్‌,వెంకటేష్‌ షాకిచ్చారు.

ఈ మూవీ కోసం భారీ పారితోషికాన్ని డిమాండ్ చేశారట. టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్‌ రూ. 12 కోట్లు, వెంకీ రూ. 13 కోట్లను డిమాండ్‌ చేశారట. అయితే స్క్రిప్ట్ నచ్చడంతో దిల్ రాజు ఒకే చెప్పారని టాక్ నడుస్తోంది. దీంతో త్వరలోనే ఎఫ్‌3కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.

- Advertisement -