నా పుట్టిన రోజు నాడు ఓ సర్‌ప్రైజ్ ఉంది-ప్రభాస్

265
- Advertisement -

బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా అనంతరం కాస్త రెస్ట్ తీసుకున్న ప్రభాస్ తాజాగా సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు శరవేగంగా పనులు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

అయితే.. అభిమానులను ప్రభాస్ దసరా శుభాకాంక్షలు చెప్తూ మరో విషయాన్ని కూడా వెల్లడించాడు. ఈనెల 23న తన పుట్టిన రోజున ఓ సర్‌ప్రైజ్ ఉందని తన ఫేస్ బుక్ పేజ్‌లో ప్రభాస్ పోస్ట్ చేశాడు.

సాహో చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రూ, 150 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక మూవీకి సంబంధించిన అన్ని వర్క్స్ పూర్తి చేసుకుని 2019లో సినిమాను విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.

అయితే.. ఇప్పుడు అభిమానుల దృష్టంతా.. ప్రభాస్ పోస్ట్ చేసిన పోస్ట్ పైనే ఉంది. సాహో చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేస్తారా.. లేక రాధాకృష్ణ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారా.. అదీకాక.. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన విషయాలు ఏమైనా వెల్లడిస్తారా..! అన్న ఆలోచనలో పడ్డారు. బాహుబలిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ నెక్ట్స్ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

- Advertisement -