“పడి పడి లేచే మనసు” మేకింగ్ వీడియో

252
- Advertisement -

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న “పడి పడి లేచే మనసు” చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందకు రానుంది. హను రాఘవపూడి దర్శకత్వంతో రూపొందిస్తున్న ఈ మూవీకి సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉండనున్న ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక సాయి పల్లవి డాక్టర్‌గా, శర్వానంద్ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. కోల్‌కతా పట్టణ నేపథ్యంలో అద్బుత ప్రేమకథ ఆధారంగా తెరకెక్కితుండగా.. శర్వానంద్ పాత్ర ఈ సినిమాలో సరికొత్తగా ఉండబోతోంది. విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవలే విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.

- Advertisement -