Kaleshwaram:మండుటెండల్లోనూ జల కళ..

47
- Advertisement -

అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టించింది. సిరిసిల్ల పర్యటనకు వెళ్తూ ఏరియల్ వ్యూ ద్వారా కాళేశ్వరం జలాలతో నిండుకుండలా ఉన్న కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టును చూసి మంత్రముగ్ధులయ్యారు మంత్రి కేటీఆర్, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్.

తమ సెల్ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నారు పోచారం , కేటీఆర్. దేశంలో ఎక్కడా లేనివిధంగా, అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది సీఎం కేసీఆర్ పాలన. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాష్ట్రంలో రెండవ అతిపెద్ద వ్యవసాయ కళాశాల నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా, జిల్లెల్లలో ప్రారంభంకానుంది.

35 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కళాశాలను నిర్మించింది. 16 ఎకరాల్లో జీ ప్లస్‌ 2 పద్ధతిలో కళాశాల భవనం, విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు, 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ప్రయోగశాల, సెమినార్‌ రూములు, ఆధునిక లైబ్రరీ ఏర్పాటుచేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -