ప్ర‌భాస్ ‘స‌లార్’ విడుదల తేదీ ఖరారు..

54
Prabhas Salaar

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు స‌లార్. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. బొగ్గు గ‌నుల బ్యాక్ డ్రాప్ లో వ‌స్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. స‌లార్‌ను 2022 ఏప్రిల్ 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

బొగ్గుగనుల్లో పనిచేసే యువకుడి పోరాటమే ‘సలార్’ చిత్ర కథాంశం అని ప్రచారం జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆలిండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడం, కేజీఎఫ్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ భారీ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో… ఈ కాంబోలో వస్తున్న ‘సలార్’ పై అంచనాలు అధికమవుతున్నాయి. హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తున్న స‌లార్ లో 100 మంది కొత్త యాక్ట‌ర్లు ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించ‌బోతున్నారు.