సరితకు ఎమ్మెల్సీ కవిత భరోసా..

69
mlc kavitha

రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన చంద్రమోహన్ కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మృతుడి భార్య సరితను ఓదార్చి ఉద్యోగం కల్పించడంతోపాటు ముగ్గురు ఆడపిల్లలను ఉన్నతంగా చదివిస్తానని హామీ ఇచ్చారు.

ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని, మనోధైర్యంతో ఉండాలని సరితకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు చంద్రమోహన్‌ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రుణయాప్‌ల వేధింపుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత హామీఇచ్చారు.