Prabhas:సలార్ సరికొత్త రికార్డు

40
- Advertisement -

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ టీజర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. టీజర్‌లో ప్రభాస్ మాస్ లుక్, బీజీఎం, ఎలివేషన్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీజర్‌లో పార్ట్1- CEASEFIRE అని పేర్కొనడంతో ఈ మూవీ పార్ట్-2 కూడా ఉంటుందని క్లారిటీ వచ్చింది.

ఏదేమైనా టీజర్‌ మాత్రం వేరే లెవల్లో ఉంది. జురాసిక్‌ పార్కులో డైనోసర్‌ ముందు ఏదైనా దిగదుడుపే అనే తరహాలో ప్రభాస్‌కు ఎలివేషన్‌ ఇవ్వడం గూస్‌బంప్స్‌ తెప్పించింది. విడుదలైన ఒక్కరోజులోనే 83 మిలియన్‌లకు పైగా వ్యూస్‌తో అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. అంతేకాకుండా 1.67 మిలయన్‌ల లైక్స్‌తో థర్డ్‌ ప్లేస్‌లో నిలిచింది.

Also Read:MP Santhoshkumar:ప్లాస్టిక్‌ని తరిమికొడదాం

టీజర్‌తో సలార్‌ సినిమాపై అందరిలోనూ అంచనాలు రెట్టింపయ్యాయి. సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమాను హోంబలే బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

Also Read:అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్..

- Advertisement -