“సాహో” ఫస్ట్ సాంగ్ ఎప్పుడో తెలుసా?

446
sahoo
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు  సుజీత్ కుమార్ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న మూవీ సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈమూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

ఆగస్ట్ 15న సాహో విడుదల కానుంది. ఇక ఈమూవీకి సంబంధించి ఒక్క సాంగ్ ను కూడా విడుదల చేయలేదు. ఈరోజు ఈమూవీలోని ఫస్ట్ సింగిల్ గురించి అనౌన్స్ మెంట్ ఉంటుందని సాహో నిర్మాణ సంస్ధ అయిన యూవీ క్రియేషన్స్ పేర్కొంది. ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన కొన్ని పాదాలను కూడా రిలీజ్ చేసింది.

కానీ సాంగ్ రిలీజ్ ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఫస్ట్ సింగిల్ విడుదల తేదిని నేడు ప్రకటించనున్నారని తెలుస్తుంది. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్..సాహో మూవీని తెలుగు, తమిళ్, హిందీలో విడుదల చేస్తున్నారు.

- Advertisement -