టాలీవుడ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగే జంటగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇండియన్ ఐదు భాషలతో పాటు చైనీస్, జాపనీస్ భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో జోరుపెంచింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా మూవీ నుంచి ప్రభాస్‌తో పాటు హీరోయిన్ పూజా హెగ్డేల కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన మరో కొత్త లుక్‌ను సోషల్ మీడియాలో వదిలారు. ఈ లుక్ ప్రభాస్ అభిమానులనే కాకుండా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇటీవల ఢిల్లీ మెట్రో రైల్‌పై ఈ సినిమా పోస్టర్స్ పెట్టారు. అలాగే, నగరాలలో భారీ కటౌట్స్‌ను పెట్టారు. ఈ సినిమాను ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పిస్తున్నారు.