నాగచైతన్య…న్యూ జెర్నీ!

57
chaitu
- Advertisement -

విడాకుల తర్వాత తమ కెరీర్‌పై దృష్టిసారించారు అక్కినేని నాగచైతన్య,సమంత. ఇప్పటికే సామ్…ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లో బిజీగా ఉండగా చైతూ కూడా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సామ్ బాటలోనే ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు చేయనున్నాడు చైతూ.

తాజాగా చైతూ నటిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా మంగళవారం నాడు సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య తన డిజిటల్ ఎంట్రీకి సంబంధించిన విషయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను కూడా తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని షేర్ చేసిన చైతూ…. ‘దూత స్టార్ట్స్’ అంటూ షేర్ చేశాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు ‘దూత’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు. మొత్తం మూడు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించబోతున్నారని, ఒక్కో సీజన్లో 8 నుంచి 10 ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం.

- Advertisement -