1970లో ప్రభాస్‌ ప్రేమ కథ..

300
Prabhas
- Advertisement -

ప్రస్తుతం పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. రామ్‌చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘రంగస్థలం’ నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తీసి ఘన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సుకుమార్. అంతేకాదు ‘మహానటి’ సినిమా కూడా ఈ కోవాకులోనే తెరకెక్కించారు .ఇక నాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేస్తున్న ‘జెర్సీ’ సినిమా కూడా 1980 బ్యాక్‌డ్రాప్‌లో చేస్తున్నదే. ముందు ముందు మరికొన్ని సినిమాలు కూడా ఇదే తరహాలో తెరకెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.

Prabhas

అయితే ఇప్పుడు ప్రభాస్‌ కథానాయకుడిగా యువీ క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. ఈ సినిమా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తారు. ఇది 1970 నేపథ్యంలో సాగే ప్రేమకథని తెలుస్తోంది. కథ ప్రకారం యూరప్‌లోనే ఎక్కువ భాగం తెరకెక్కిస్తారు. కాస్త ఫాంటసీ, థ్రిల్లింగ్‌, యాక్షన్‌ కూడా జోడించారట. ఈ సినిమా కోసం కొత్త తరహా సెట్లు నిర్మించే పనిలో ఉంది చిత్ర బృందం.

కళా దర్శకుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సెట్లు తీర్చిదిద్దే పనిలో ఉన్నారని సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో చిత్రీకరణ మొదలవుతుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు బడ్జెట్ వంద కోట్ల వరకు ఉంటుందని సిని వర్గాల సమాచారం.

- Advertisement -