ట్రెండింగ్‌లో ప్రభాస్‌ న్యూ లుక్‌..

603
prabhas
- Advertisement -

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతీ సినిమాకు న్యూలుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమాకు తగ్గట్టు తన లుక్ మార్చుకుంటు కొత్తగా కనిపిస్తుంటాడు. తాజాగా ఈ బహుబలి హీరో న్యూ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. తాజాగా ప్ర‌భాస్ ట్రెండీ లుక్ లో క‌నిపిస్తున్న ఫొటో ఇపుడు అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

ఈ ఫోటోలో ఛార్మింగ్ లుక్ , బ్లాక్ లెద‌ర్ జెర్కిన్‌, జాగ్వార్ జీన్స్ లో స్లైలిష్ గాగుల్స్ తో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. సోష‌ల్ మీడియాలో ఈ ఫొటో ట్రెండింగ్ లో కొన‌సాగుతుంది. ప్రస్తుతం డార్లింగ్‌ ప్రభాస్‌ రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల‌తోపాటు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

- Advertisement -