131 జీవోను సవరిస్తాం- మంత్రి కేటీఆర్‌

258
ktr

శాస‌న‌స‌భ్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు 131 జీవోను స‌వ‌రించి.. రేపే జీవోను విడుద‌ల చేస్తామ‌ని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు. దీంతో ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తుదారుల‌కు ఊర‌ట క‌లిగింది. తాజాగా దీనిపై ఆయన అసెంబ్లీలో మరింత క్లారిటీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ప‌ట్ల గౌర‌వం ఉన్న‌ది కాబ‌ట్టే మొన్న తీసుకువ‌చ్చిన 131 జీవోను స‌వ‌రిస్తామ‌న్నారు. రిజిస్ర్టేష‌న్ స‌మ‌యంలో ఉన్న మార్కెట్ విలువ ప్ర‌కార‌మే రుసుం వ‌సూలు చేస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.