జులై నుంచి ప్రభాస్ కొత్త చిత్ర షూటింగ్..

253
Prabhas new film shooting from july
- Advertisement -

బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సాధించిన నటుడు ప్రభాస్. ఈ సినిమా అనంతరం ఆయన ‘రన్ రాజా రన్’ ఫేమ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘సాహో’ చిత్రంలో నటి్స్తున్నారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో యువి క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్‌ కూడా ఉంటాయట. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది.

Prabhas new film shooting from july

అయితే ‘సాహో’ సినిమా తర్వాత ప్రభాస్ ‘జిల్’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, ప్రభాస్ అభిమానులను ఎక్కడా నిరుత్సాహపరచదని రాధాకృష్ణ అన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జులైలో మొదలవనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మించనున్నారు. 2019 నాటికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట.

 

- Advertisement -