‘కల్కి’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్స్

41
- Advertisement -

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా, ప్రస్తుతం ‘సలార్’ సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. IIT బాంబే టెక్ ఫెస్ట్ 23లో నాగ్ అశ్విన్ పాల్గొనబోతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. కల్కి సినిమాకి సంబంధించిన అనేక విషయాలను నాగ్ అశ్విన్ ఈ మీట్ లో ప్రేక్షకులతో పంచుకోబోతున్నారు.

అన్నట్టు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. గ‌న్స్ రీ-ఇమాజినింగ్ అంటూ తాజాగా ఓ వీడియో మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో కల్కిలో వాడే గ‌న్స్ ఎలా రూపొందించారు అనేది చూపించారు. కాగా, ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఈ మూవీలో ఇప్పటికే దీపికా, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని, రానా వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా మరో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమాలో దుల్కర్ నటిస్తే.. మలయాళంలో కూడా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి.

Also Read:Kalyanram:రెండేళ్ల కష్టమే మా ‘డెవిల్’

- Advertisement -